తమిళ నిర్మాతలపై (Tamil producers)ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కలైపులి థాను(Kalaipuli thanu), అన్బుచెజియన్, ఎస్‌ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా (gnanavel raja) సహా పదిమంది నిర్మాతల కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో సోదాలు చేశారని తెలిసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగించారని సమాచారం. (It rides on tamil producers)