‘వారాహి’ ఆలయంలో...
ABN , First Publish Date - 2022-11-15T06:02:34+05:30 IST
సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. రమాదేవి నారగాని నిర్మాత. ఈ చిత్రానికి ‘వారాహి’ టైటిల్ నిర్ణయించారు...

సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. రమాదేవి నారగాని నిర్మాత. ఈ చిత్రానికి ‘వారాహి’ టైటిల్ నిర్ణయించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. నిర్మాత సురేశ్ బాబు స్విచ్చాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో సాగే సినిమా ఇది. డివోషనల్గా ఉంటూనే.. ఉత్కంఠ కలిగిస్తుంది. డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామ’’న్నారు. ‘‘సంతోష్ ఈ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. అంతబాగా నచ్చింది. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది వరకు ‘సుబ్రహ్మణ్యపురం’ వచ్చింది. ‘వారాహి’ అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఈమధ్య డివోషనల్ చిత్రాలు మంచి విజయాల్ని అందుకొంటున్నాయి. ఆ జాబితాలో ‘వారాహి’ కూడా చేరుతుంద’’న్నారు సుమంత్. సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఈశ్వర్ చంద్.