తమిళ నటుడు, దర్శకుడు ఎస్. జె. సూర్య త్వరలోనే నటుడిగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ వేదిక నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో ఆయన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు ఆయన శిష్యుడు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించనున్నారు. చెన్నై సహా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆగస్టు నుంచి ఈ వెబ్‌సిరీస్ చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఎస్. జె. సూర్య ప్రస్తుతం ‘బొమ్మై’, ‘మానాడు’, ‘డాన్’ చిత్రాల్లో నటిస్తున్నారు.