జంట సినిమాల చిత్రీకరణలో...

శరవణన్‌ దర్శకత్వంలో విశాల్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌  ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ స్టూడియోలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సింగిల్‌ షెడ్యూల్‌లో జూలై ఆఖరుకల్లా పూర్తి చేయనున్నారు. దీంతో పాటే ‘ఎనిమీ’ షూటింగ్‌లోనూ విశాల్‌ త్వరలో పాల్గొంటారని సమాచారం. విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎనిమీ’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ త్వరలోనే హైదరాబాద్‌లో పున:ప్రారంభం కానుందని సమాచారం. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలను, ఒక పాటను తెరకెక్కిస్తే ‘ఎనిమీ’ చిత్రీకరణ పూర్తవుతుంది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.