దేశభక్తి నేపథ్యంలో...

ABN , First Publish Date - 2022-01-27T05:32:24+05:30 IST

మత విద్వేషాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు పడుతున్న అవస్థల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జయహో ఇండియన్స్‌’....

దేశభక్తి నేపథ్యంలో...

మత విద్వేషాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు పడుతున్న అవస్థల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జయహో ఇండియన్స్‌’. ఆర్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రాజ్‌ భీమ్‌రెడ్డి నటిస్తూ నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘జయహో ఇండియన్స్‌’ ఆంథమ్‌ వీడియోసాంగ్‌ను ఇటీవలె విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ గీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. జారాఖాన్‌, చమ్మక్‌చంద్ర, సమీర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2022-01-27T05:32:24+05:30 IST