'బంగార్రాజు'లో చైతుకి జంటగా కృతి శెట్టి..?

ABN , First Publish Date - 2021-07-08T14:14:53+05:30 IST

'బంగార్రాజు'లో చైతుకి జంటగా కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తాజాగా వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున - నాగ చైతన్య హీరోలుగా 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కనున్న సంగతి తెలిసందే.

'బంగార్రాజు'లో చైతుకి జంటగా కృతి శెట్టి..?

'బంగార్రాజు'లో చైతుకి జంటగా కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తాజాగా వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున - నాగ చైతన్య హీరోలుగా 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కనున్న సంగతి తెలిసందే. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ నటించనున్నట్టు ముందునుంచి వార్తలు వస్తున్నాయి. 'సోగ్గాడే చిన్నినాయనా'లోనూ ఆమెనే నటించారు. ఇక ఈ సీక్వెల్‌లో చైతుకి జంటగా పలువురు పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరికి 'ఉప్పెన' బ్యూటీవైపు మొగ్గు చూపినట్టు సమాచారం. నాగార్జున 'ఉప్పెన' సినిమాలో కృతిశెట్టి పర్ఫార్మెన్స్‌కి ఫిదా అయ్యాడట. అందుకే ఆయన 'బంగార్రాజు'లో కృతిశెట్టి పేరును సూచించినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చిత్ర బృందం స్పందిస్తే గానీ నమ్మలేము.  


Updated Date - 2021-07-08T14:14:53+05:30 IST