రామారావుతో గోవా బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌

ABN , First Publish Date - 2021-08-16T18:36:58+05:30 IST

మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా ఓ ...

రామారావుతో గోవా బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌

మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ గోవా బ్యూటీ ఇలియానాను సంప్ర‌దించార‌ట‌. ‘కిక్‌, ఖ‌త‌ర్నాక్‌, దేవుడు చేసిన మ‌నుషులు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని’ సినిమాల్లో ర‌వితేజ‌తో జోడీ క‌ట్టిన జ‌గ‌న సుంద‌రి ఇలియానా, స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 



Updated Date - 2021-08-16T18:36:58+05:30 IST