సూర్య హిట్ ఇస్తే తెలుగులో అవకాశాలు వస్తాయా..?

ABN , First Publish Date - 2022-03-08T13:39:12+05:30 IST

నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. దీని తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం

సూర్య హిట్ ఇస్తే తెలుగులో అవకాశాలు వస్తాయా..?

నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. దీని తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలలో ప్రియాంక డీసెంట్‌గా కనిపించింది. ఆ ప్రభావమా..లేక రెండు సినిమాలు ఫ్లాప్స్‌గా మిగలడమా తెలీదు గానీ మళ్ళీ అమ్మడికి తెలుగులో అవకాశాలు దక్కలేదు. ప్రియాంక అరుళ్ మోహన్ అందానికి ఇక్కడ అభిమానులు బాగానే ఏర్పడ్డారు. కానీ, స్టార్స్ పక్కన నటించే అవకాశాలే అందుకోలేకపోయింది.


ఇక తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. గత ఏడాది శివ కార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించి హిట్ అందుకుంది. అలాగే, మరోసారి ఆ హీరోతోనే సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు మేకర్స్‌ను ఆకట్టుకొని ఇప్పుడైనా ఇక్కడ అవకాశాలు అందుకొనేందుకు ట్రై చేస్తోందట ప్రియాంక. సూర్యకు తెలుగులో అభిమానులు బాగానే ఉన్నారు. కాబట్టి ఈటీ హిట్ అయితే, అమ్మడికి తెలుగులో ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..ప్రియాంక ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో. 

Updated Date - 2022-03-08T13:39:12+05:30 IST