Priyanka Chopra : అప్పట్లో నేను ‘అబద్ధపు అందాలే’ నిజం అనుకున్నాను

ABN , First Publish Date - 2021-12-02T18:20:19+05:30 IST

‘‘అందానికి... ఎన్నో అసహజమైన కొలమానాలున్నాయి’’ అన్న ప్రియాంక చోప్రా తాను కూడా యవ్వనంలో అవన్నీ నిజమే అనుకున్నానని చెప్పింది. ‘అతి సన్నగా ఉండటం’ అటువంటి ఓ అబద్ధపు అందమే అంటోందామె. అయితే...

Priyanka Chopra : అప్పట్లో నేను ‘అబద్ధపు అందాలే’ నిజం అనుకున్నాను

    ‘‘ఒకప్పుడు నేను ‘అబద్ధపు అందాల్నే’ నిజం అనుకున్నాను’’ అంటోంది ప్రియాంక చోప్రా. గతంలో తాను ఫెయిర్‌నెస్ క్రీముల్ని ప్రమోట్ చేయటంపై ఆమె తాజాగా స్పందించింది. కెరీర్ మొదట్లో పీసీ కూడా చాలా మంది హీరోయిన్స్‌లాగే ఒంటి ఛాయను మెరుగు పరిచే స్కిన్ క్రీమ్స్‌కు సంబంధించిన యాడ్స్‌లో కనిపించింది. అది తప్పేనంటూ అంగీకరించిన ఆమె ఎందుకు వాటిల్లో నటించిందో వివరించింది...

‘‘అందానికి... ఎన్నో అసహజమైన కొలమానాలున్నాయి’’ అన్న ప్రియాంక చోప్రా తాను కూడా యవ్వనంలో అవన్నీ నిజమే అనుకున్నానని చెప్పింది. ‘అతి సన్నగా ఉండటం’ అటువంటి ఓ అబద్ధపు అందమే అంటోందామె. అయితే, స్లిమ్‌గా, జీరో సైజులో ఉండాలనే భ్రమ కంటే పెద్దది ‘తెల్లటి నిగారింపు’ మీద ఉండే మోజని చెప్పింది ప్రియాంక. ఆ దుష్ప్రచారానికి అప్పట్లో తాను కూడా బలైందట. నల్లగా ఉండే వారికంటే తెల్లటి వారే అందంగా ఉంటారని భావించేదట. దాంతో ఫెయిర్‌నెస్ క్రీములు ప్రమోట్ చేయటం కెరీర్ మొదట్లో తప్పనిపించలేదని ప్రియాంక వివరణ ఇఛ్చుకుంది. అప్పటి మాట ఎలా ఉన్నా ఈ మాజీ మిస్ వరల్డ్ తన దేసీ డస్కీ అందాలతోనే ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా అమెరికాలోనూ హల్‌చల్ చేస్తోంది...        

Updated Date - 2021-12-02T18:20:19+05:30 IST