ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకులేదు..క్లారిటీ ఇచ్చిన RGV
ABN , First Publish Date - 2022-06-25T21:15:47+05:30 IST
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RamGopal varma) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన మనసుకు ఆ క్షణం ఏది అనిపిస్తే అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టేసి నానా

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RamGopal varma) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన మనసుకు ఆ క్షణం ఏది అనిపిస్తే అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టేసి నానా చిక్కులు తెచ్చుకుంటారు. ఇలాంటివి ఇప్పటికే లెక్కలేనన్ని జరిగాయి. ఇలాంటి కాంట్రవర్సీనే మరోటి అయి సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. త్వరలో భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, బీజేపీ తరపున ద్రౌపది ముర్ము ( Draupadi Murmu) అభ్యర్థిగా ఉన్నారు. అధిష్టానం ఆమె పేరుని ప్రకటించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ.. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే, పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ జూన్ 24న ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌తో బీజేపీ నాయకులు రగిలిపోయారు. దాంతో వారు ఆర్జీవీపై ఫైర్ కావటమే కాదు.. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రపతి అభ్యర్థిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు కూడా చేశారు. రాంగోపాల్ వర్మపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టాలని, కఠిన చర్యలను తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులను కోరారు. ఇక తాజాగా ఈ విషయంలోనే రాంగోపాల్ వర్మపై ఆదిలాబాద్ టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు తుడుందెబ్బ ఆదివాసీ సంఘాలు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును అవమానించేలా వ్యాఖ్యానించిన..ఆర్జీవీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తను చేసిన ట్వీట్‌కు మళ్ళీ ట్వీట్ ద్వారానే క్లారిటీ ఇచ్చారు. 'మహాభారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది. అలాంటి పేరు చాలా అరుదుగా ఉంటుంది. నా వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదు'..అని ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
'ద్రౌపది అనే పేరు వినగానే మహాభారతంలో పాత్రలు గుర్తుకు వచ్చాయని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదు'.. అని పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చారు. మరి వర్మ ఇచ్చిన ఈ వివరణతో వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. కాగా, ఆర్జీవీ దర్శకత్వంలో ఈ వారం 'కొండా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో ఆయన బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపొందనున్నట్టు సమాచారం.