విమానంలో ఏడ్చాను!
ABN , First Publish Date - 2021-08-31T06:28:54+05:30 IST
కొవిడ్-19 కారణంగా గతేడాది ప్రపంచమంతా స్తంభించింది. అందరూ ఇళ్లకు పరిమితం కాక తప్పలేదు. ఆ సమయంలో ప్రియాంకా చోప్రా సైతం ఇంట్లోనే ఉన్నారు. పరిస్థితులు కొంచెం చక్కబడిన చిత్రీకరణలు చేశారు...

కొవిడ్-19 కారణంగా గతేడాది ప్రపంచమంతా స్తంభించింది. అందరూ ఇళ్లకు పరిమితం కాక తప్పలేదు. ఆ సమయంలో ప్రియాంకా చోప్రా సైతం ఇంట్లోనే ఉన్నారు. పరిస్థితులు కొంచెం చక్కబడిన చిత్రీకరణలు చేశారు. అయితే, కరోనా తర్వాత ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పుడు కన్నీళ్లు వచ్చాయట. విమానంలో ఏడ్చానని ప్రియాంకా చోప్రా చెప్పారు. ‘‘నేను ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నాను. కుటుంబ సభ్యుల మధ్య చాలా సురక్షితంగా అనిపించింది. ఆ తర్వాత తొలిసారి హాలీవుడ్ ఫిల్మ్ ‘ద మ్యాట్రిక్స్: రిజరెక్షన్స్’ చిత్రీకరణ కోసం జర్మనీ వెళ్లాను. అప్పుడు విమానంలో ఏడ్చాను. భయభ్రాంతులకు గురయ్యాను’’ అని ప్రియాంకా చోప్రా తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, సెట్‌లో కొవిడ్-19 నిబంధనలు పాటించడంతో మనసు శాంతించిందన్నారు. భర్త నిక్ జోనాస్, తల్లి మధు చోప్రా, ఇతర కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని ప్రియాంకా చోప్రా చెప్పుకొచ్చారు. ‘‘మ్యాట్రిక్స్, టెక్ట్స్ ఫర్ యు’ సినిమాల చిత్రీకరణ సమయంలో కుటుంబ సభ్యులందరూ నాతోనే ఉన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను మేమంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. నేను కుదుటపడిన తర్వాత నిక్ వెళ్లిపోయాడు. తర్వాత నేను అమెజాన్ సిరీస్ ‘సిటుడెల్’ చిత్రీకరణకు వెళ్లా’’ అని ప్రియాంక వివరించారు. ‘సిటుడెల్’ చిత్రీకరణలో ఆమెకు గాయలయ్యాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో బికినీ ఫొటోలను ప్రియాంకా చోప్రా పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.