నీకోసమే నేనున్నా!
ABN , First Publish Date - 2022-09-06T05:30:00+05:30 IST
శ్రీజిత్ రెడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నీకై నేను’. కృష్ణ కుమార్ ఆసూరి దర్శకుడు...

శ్రీజిత్ రెడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నీకై నేను’. కృష్ణ కుమార్ ఆసూరి దర్శకుడు. నాగిరెడ్డి తారక ప్రభు, ఏ.హనీఫ్ నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్‌నిచ్చారు. ఎస్.గోపాల్‌రెడ్డి స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ సరిహద్దుల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా. ప్రేమకథకూ చోటుంది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. ‘‘ఈనెల 15 నుంచి కేరళలో షూటింగ్ ప్రారంభిస్తామ’’న్నారు నిర్మాతలు. సంగీతం: మెగా కోటి. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సి.భాస్కరరాజు, ఉదయ్‌కుమార్.