Balakrishna: బాలకృష్ణ సెన్సషనల్ సినిమాకి షాకింగ్ డిమాండ్

Twitter IconWatsapp IconFacebook Icon
Balakrishna: బాలకృష్ణ సెన్సషనల్ సినిమాకి షాకింగ్ డిమాండ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'చెన్నకేశవ రెడ్డి' (Chennakesava Reddy) సినిమా విడుదలయి 20 సంవత్సరాలు (20 years) పూర్తి చేసుకున్న (completed) సందర్బంగా ఆ సినిమాని మళ్ళీ  విడుదల (Re-release) చేస్తున్నారు ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh). ఇప్పటి వరకు 400 (Four hundreds) పైగా స్క్రీన్స్ (Screens) లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాము, అని చెప్పాడు బెల్లంకొండ. ఈ సినిమాకి వస్తున్న డిమాండ్ చూసి నేనే షాక్ అయ్యా, ఒక్కో ఏరియా కి హక్కుల (Rights) కోసం పెద్ద మొత్తం లో  డబ్బులు ఇస్తాము అని ఒకరితో ఒకరు పోటీ పడి మరీ వస్తున్నారు, అందుకే నేనే నేరుగా విడుదల చెయ్యాలని అనుకున్నా, అన్నాడు సురేష్.

ఈ సినిమా హైలైట్స్ కొన్ని: 

1. ఈ సినిమాకి అప్పట్లో 15 కోట్లకు (15 crore) పైగా బడ్జెట్ పెట్టారు. అప్పట్లో ఇదే హై బడ్జెట్ (High Budget Cinema) సినిమా. ఈ సినిమా 2002 సంవత్సరం లో విడుదల అయింది. 

2. ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ (openings) చూసి అప్పట్లో ఇండస్ట్రీ ( Telugu Film industry) అందరూ షాక్ తిన్నారు. అంతలా కలెక్ట్ (Collections) చేసింది ఈ సినిమా. ఇండస్ట్రీ హిట్ (Industry Hit) గా నిలిచింది కూడా అప్పట్లో. 

3. మొదటి సారిగా ఈ సినిమా కోసం నాలుగు హెలికాఫ్టర్లు (Four Helicopters) వాడారు. కర్నూల్ సిటీ (Kurnool City) చుట్టుపక్కల ఈ సినిమా షూటింగ్ సమయం అంతా పెద్ద హడావిడిగా ఉండేది. కారులో వెళుతున్నట్టు, ఈ సినిమా కోసం యూనిట్ స్టాఫ్ టిఫిన్, లంచ్ బాక్స్ పట్టుకొని హెలికాప్టర్ లో షూటింగ్ స్పాట్ కి వెళ్లేవారు. 

4. దర్శకుడు వినాయక్ (V V Vinayak) మొదటి  సినిమా తరువాత, ఈ సినిమాలో కూడా టాటా సుమో (Tata Sumo) వెహికల్స్ (Vehicles) ను పోరాట సన్నివేశాల్లో (Action sequences) బాంబులు పేల్చి మీదకి లేపాడు. అవి పెద్ద హైలైట్ (HIghlights) గా ఈ సినిమాలో నిలిచాయి. అంటే పోరాట సన్నివేశాల్లో టాటా సుమోలు మొదట ఉపయోగించింది వినాయక్, అక్కడ నుండే అది ఒక ట్రెండ్ గా మారింది. 

5. విజయనగరం(Vizianagaram) లో ఈ సినిమా స్క్రీనింగ్ అవుతున్నప్పుడు సినిమాలో ఒక సీన్ లో ఒక మారుతీ కారు పెద్ద శబ్దం తో పేలి చాలా ఎత్తుకు వెళ్లి కిందపడుతుంది. ఆ సీన్ తరువాత సినిమా ఆపేసారు. ఇదేంటిరా బాబు, ఇలా మొదటి సారి పెద్ద పెద్ద శబ్దాలతో ఇలా వెహికల్స్ పేల్చటం నచ్చలెదేమో వాళ్ళకి అని నిర్మాత భయపడ్డాడు. కానీ ఆ సినిమా థియేటర్ ఓనర్ తన ఫామిలీ మెంబెర్స్ ని కూడా తీసుకు వచ్చి చూపిస్తా అని వాళ్ళు వచ్చాక సినిమా కంటిన్యూ చేశారట. ఆ తరువాత టాటా సుమో వెహికల్స్ పేలి పైకెళ్ళి కిందపడే  సీన్స్ వస్తాయి. 

6. ఇందులో బాలకృష్ణ నటన పీక్స్ లో (Peaks) ఉంటుంది. అప్పటికే అయన ఒక ఫ్యాక్షన్ (Faction movie) సినిమా చేసి వున్నాడు, ఆ తరువాత ఇది చెయ్యడం తో అప్పట్లో బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకి క్రేజ్ (craze) విపరీతంగా ఉండేది. ఫ్యాక్షన్ సినిమా అంటే బాలకృష్ణ మాత్రమే చెయ్యాలి అని అనుకునేవారు అప్పట్లో. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేసాడు. దర్శకుడు వి వి వినాయక్ కి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మాస్ దర్శకుడిగా పేరు తెచ్చిన సినిమా కూడా ఇదే. ఇది అతని రెండో సినిమా దర్శకుడిగా కానీ ఈ సినిమా విజయంతో వినాయక్ అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.