68 ఏళ్ల పెద్దావిడ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన Hrithik... ఇంతకీ, ఆమె ఎవరంటే....

ABN , First Publish Date - 2022-01-20T23:56:31+05:30 IST

68 ఏళ్ల పింకీ రోషన్ ఉత్సాహంగా వర్కవుట్స్ చేస్తోన్న విజువల్స్‌ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘68 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఫిట్‌నెస్, వెల్‌నెస్ కోసం ఇంతలా కష్టపడటం చూస్తుంటే... మనమంతా కూడా వయస్సుతో సంబంధం లేకుండా మరింత మెరుగవ్వగలమని నాకు నమ్మకం కలుగుతోంది...’’ అంటూ తన పోస్ట్‌లో ఆయన రాశాడు.

68 ఏళ్ల పెద్దావిడ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన Hrithik... ఇంతకీ, ఆమె ఎవరంటే....

ఆమె పేరు పింకీ రోషన్. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ భార్య, హృతిక్ రోషన్ తల్లి. అయితే, 68 ఏళ్ల పింకీ రోషన్ ఉత్సాహంగా వర్కవుట్స్ చేస్తోన్న విజువల్స్‌ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘68 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఫిట్‌నెస్, వెల్‌నెస్ కోసం ఇంతలా కష్టపడటం చూస్తుంటే... మనమంతా కూడా వయస్సుతో సంబంధం లేకుండా మరింత మెరుగవ్వగలమని నాకు నమ్మకం కలుగుతోంది...’’ అంటూ తన పోస్ట్‌లో ఆయన రాశాడు. 


‘‘58 ఏళ్లప్పుడు.... మా అమ్మ వర్కవుట్స్ చేయటం మొదలు పెట్టింది. సమయం మించిపోవటం అనేది ఏదీ ఉండదు...’’ అని కూడా హృతిక్ తన తల్లి గురించి నెటిజన్స్‌కి వివరించాడు. సహజంగానే పింకీ రోషన్ వ్యాయామాలు చూసిన సొషల్ మీడియా యూజర్స్ ఆశ్చర్యపోకుండా తమని తాము అదుపు చేసుకోలేకపోయారు. చాలా మంది హృతిక్ షేర్ చేసిన వీడియోకి ‘వావ్’ ఎమోజీస్‌తో స్పందన తెలిపారు. 


48 ఏళ్ల హృతిక్ కూడా బీ-టౌన్‌లో ఫిట్‌నెస్‌కి చాలా ఫేమస్. చాలా మంది యంగ్ హీరోస్ అతడి లాంటి గ్రీక్ గాడ్ లుక్స్ కావాలని తపించిపోతుంటారు. ఈ మధ్యే సౌత్ యాక్టర్ మాధవన్ కూడా హృతిక్ లాంటి ఫిజిక్, ఫిట్‌నెస్ తనకూ ఉంటే బావుండేదని కామెంట్ చేశాడు.  



Updated Date - 2022-01-20T23:56:31+05:30 IST