కొన్ని బంధాలకు అంతం లేదు : హృతిక్ రోషన్ మాజీ భార్య

ABN , First Publish Date - 2022-01-23T15:39:44+05:30 IST

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ విడాకుల తర్వాత ఆరోగ్యకరమైన బంధాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే...

కొన్ని బంధాలకు అంతం లేదు : హృతిక్ రోషన్ మాజీ భార్య

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ విడాకుల తర్వాత ఆరోగ్యకరమైన బంధాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒకరి ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కి ఎలాంటి కోపతాపాలు, భేషజాలు లేకుండా అటెండ్ అవుతుంటుంది ఈ మాజీ జంట. తాజాగా మరోసారి హృతిక్ సోదరి సునైనా రోషన్ పుట్టిన రోజు సందర్భంగా కలిశారు ఈ ఎక్స్ కపుల్.


సోషల్ మీడియాలో సునైనాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది సుసానే ఖాన్. ఇన్స్‌స్టాగ్రామ్ స్టోరీలో హృతిక్‌, సునైనాతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ని చేసింది ఈ భామ. దానికి.. ‘కొన్ని బంధాలకు అంతం లేదు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుకన్నాన’ని సుసానేని, హృతిక్ రోషన్‌ని ట్యాగ్ చేసింది ఈ బ్యూటీ. 


అంతేకాకుండా మరో స్టోరీలో.. ‘2022 నీకు ఎంతో అందమైన సంవత్సరంగా నిలవాలి. హ్యాపీ బర్త్ డే సునైనా రోషన్’ అంటూ రాసుకొచ్చింది సుసానే.



Updated Date - 2022-01-23T15:39:44+05:30 IST