లండన్‌లో జాబ్ రాకపోవడంతో హీరోయిన్ అయ్యా: Parineeti Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా సోదరిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన పరిణీతి చోప్రా అనతి కాలంలోనే ప్రముఖ కథానాయికగా ఎదిగింది. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటోంది. నిజానికి పరిణీతి హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదట. ఇంటర్నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేయాలనేది పరిణీతి చిన్న నాటి కల అట. అందుకే రూ.50 లక్షలు లోన్ తీసుకుని లండన్‌లో చదువుకుందట. మాంఛెస్టర్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్, ఫైనాన్స్, ఎకనమిక్స్‌లో బ్యాచిలర్ పట్టా అందుకుంది. 


`నేను ఓ పెద్ద బ్యాంకర్ కావాలనేది నా చిన్న నాటి కల. చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇంగ్లండ్ వెళ్లి చదువుకున్నా. అయితే ఎంత ప్రయత్నించినా నాకు అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో ముంబై వచ్చేశా. యశ్ రాజ్ స్టూడియోస్‌లో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కోసం అప్లై చేశా. అయితే అక్కడ ఖాళీ లేకపోవడంతో పీఆర్, మార్కెటింగ్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేయమన్నారు. ఆ అవకాశం అందుకుని కష్టపడి పనిచేశా. అక్కడే నటన, ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకున్నా. అక్కడే మనీష్ శర్మ నన్ను గుర్తించి 2011లో `లేడీస్ వెర్సస్ రిక్కీబల్` సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కణ్నుంచి హీరోయిన్‌గా మారాన`ని ఈ రోజు 33వ జన్మదినోతవ్సం జరుపుకుంటున్న పరిణీతి చెప్పింది. 

ఇవి కూడా చదవండిImage Caption

అసలు ఈ ఫొటోలతో ఏం చెప్పాలనుకుంటున్నావ్.. వెంటనే ఆపేయ్.. ఆ హీరో, హీరోయిన్ల మధ్య నెట్టింట రచ్చ..!Alia Bhatt: ఒకటి కాదు రెండు కాదు.. RRR హీరోయిన్ నుంచి ఏకంగా మూడు తీపికబుర్లు..!

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.