‘బ్లాక్ స్వాన్’ (Black Swan), ‘థోర్’(Thor), ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’(Avengers: Endgame)వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు చేరువైన నటి నటాలీ ఫోర్ట్‌మన్ (Natalie Portman). తాజాగా ‘థోర్: లవ్ అండ్ థండర్’ (Thor: Love And Thunder)చిత్రంలో నటించారు. ఈ మూవీ జులై 8న విడుదల కానుంది. ఈ సినిమాలో నటాలీ ఆరడుగులతో కనిపించాల్సి వచ్చింది. కానీ, ఆమె మాత్రం 5అడుగుల 3అంగుళాలు మాత్రమే ఉంటారు. ఈ మూవీలో ఆరడుగులు ఉన్న పాత్ర పోషించడానికి బరువు పెరిగానని ఆమె చెప్పారు. చిత్ర బృందం ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టిందని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే 10నెలలు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు.
‘థోర్: లవ్ అండ్ థండర్’ సినిమాలో సహనటులతో కలసి నడిచే కొన్ని సీన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఆరడుగుల పొడుగుతో కనిపించాలి. ప్రస్తుతం పొడవు పెరగడం అసాధ్యం. అందు కోసం దర్శకులు ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టారు. నేలకు కొంచెం ఎత్తులో ఓ సరికొత్త మార్గాన్ని నిర్మించారు. ఆ మార్గాన్ని ‘డెక్’ అంటారు. ఆరడుగులతో కనిపించాడనికి ఈ ‘డెక్’ మీదే నటాలీ నడిచారు. చిత్రబృందం అంతా ఈ సీన్స్ అన్నింటిని ముందుగా రిహార్సల్ చేశారు. ఈ సన్నివేశాల్లో క్రిస్ హెమ్సవర్త్ కూడా నటించారు. అందుకోసం ఆయన తీవ్రంగా శ్రమించారని నటాలీ స్పష్టం చేశారు. ‘థోర్: లవ్ అండ్ థండర్’ సినిమాను మార్వెస్ స్టూడియోస్ నిర్మించింది. శాన్ డియోగోలో 2019లో జరిగిన కామికాన్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మార్వెల్ పేర్కొంది. ‘థోర్’ ప్రాంచైజీలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఆస్కార్ అవార్డు విజేత తైకా వెయిటిటి (Taika Waititi) దర్శకత్వం వహించారు. ఇండియాలో ఈ చిత్రం ఒక రోజు ముందుగానే జులై 7న విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.