‘‘నువ్వు ఎన్నిసార్లు బాయ్‌ఫ్రెండ్స్‌తో విడిపోయావ్?’’... శ్రుతీ హసన్ బదులేంటో తెలుసా?
ABN , First Publish Date - 2021-12-31T23:12:40+05:30 IST
శ్రుతీ హసన్ తాజాగా ఓ ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ చేసింది. నెటిజన్స్ క్వశ్చన్స్‌కి తనదైన స్టైల్లో యాన్సర్స్ ఇచ్చింది. అయితే ఒక ఆకతాయి మాత్రం కాస్త లైన్ క్రాస్ చేసి ‘‘ఇప్పటి వరకూ మీరు ఎన్ని సార్లు బ్రేకప్ చేసుకున్నారు?’’ అంటూ ప్రశ్నించాడు. అందులోని వెటకారం అర్థం చేసుకున్న బోల్డ్ బ్యూటీ కాస్త గట్టిగానే జవాబు ఇచ్చింది.

తన ఖాతాలో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయన్న నెటిజన్‌తో శ్రుతీ ‘‘నీకు ఎంత మంది గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవ్వరూ లేరనుకుంటున్నాను... లేదంటే హాఫ్ గాళ్‌ఫ్రెండ్ ఉండి ఉంటుంది’’ అంది. నిజానికి శ్రుతీ మరీ విచ్చలవిడిగా ఎఫైర్స్ నడిపేసిన రకమేం కాదు. కాకపోతే ఆ మధ్య ఓ లండన్ సింగర్‌తో కొన్నాళ్లు రొమాన్స్ చేసింది. తరువాత బ్రేకప్ చేసుకుని ఇండియా తిరిగి వచ్చేసిన లేడీ హసన్ ప్రస్తుతం మరోసారి లవ్ బ్లిస్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఫోటోగ్రఫర్ శంతను హజారికాతో డేటింగ్ కొనసాగిస్తోంది. చూడాలి మరి, 2022లో పెళ్లి కబురు ఏమైనా చెబుతుందేమో...