అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్‌లు పెడుతున్నారు
ABN , First Publish Date - 2022-08-14T06:18:03+05:30 IST
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ చిత్రం శనివారం విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది....

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ చిత్రం శనివారం విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. ఈ సందర ్భంగా నిఖిల్ మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రేక్షకులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ‘కార్తికేయ 2’కు మున్ముందు కూడా ఇదే ఆదరణ కొనసాగుతుంది’ అన్నారు. చిత్ర కథానాయిక అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘చందు మంచి పాయింట్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో నేను భాగమవడం ఆనందంగా ఉంద’న్నారు. చందు మాట్లాడుతూ ‘సినిమా సక్సెస్ కష్టాన్ని మరిపించింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. దివంగత నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ గారి స్మృతికి ఈ సినిమా విజయాన్ని అంకితం ఇస్తున్నాం అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు.