House of The Dragon: మోత మోగుతోంది

ABN , First Publish Date - 2022-09-22T02:27:52+05:30 IST

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది. ఈ టీవీ షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఎనిమిది సీజన్స్

House of The Dragon: మోత మోగుతోంది

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది. ఈ టీవీ షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఎనిమిది సీజన్స్ ప్రసారం అయ్యాయి. ఎనిమిదవ సీజన్‌తో షోను అర్ధాంతరంగా ముగించేయడంతో అభిమానులంతా అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో హెచ్‌బీవో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు ప్రీక్వెల్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ప్రీక్వెల్‌కు ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ (House of The Dragon) అని టైటిల్ పెట్టింది. ఈ షో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. వ్యూయర్ షిప్‌లో సంచలనం సృష్టిస్తుంది. 


‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ప్రతి ఎపిసోడ్‌కు సగటున 29మిలియన్ వ్యూయర్‌షిప్ లభించింది. ఫస్ట్ ఎపిసోడ్‌‌ను 10మిలియన్ మంది చూశారు. ప్రతి ఎపిసోడ్‌కు వ్యూయర్ షిప్ పెరుగుతూనే ఉంది. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ఎపిసోడ్ 4ను హెచ్‌బీవోలో 2.47మిలియన్ మంది చూశారు. తాజాగా ఎపిసోడ్ 5 వ్యూయర్ షిప్‌పై రిపోర్టు వెలువడింది. ఆ రిపోర్టు ప్రకారం. .హెచ్‌బీవో ప్లాట్‌ఫామ్‌పై ఈ ఎపిసోడ్‌ను 2.57మిలియన్ మంది వీక్షించారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్‌తో పోల్చుకుంటే వీక్షణలు 4శాతం పెరిగాయి. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ఎపిసోడ్స్ డిస్నీ+ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. మార్టిన్ రాసిన ‘ఫైర్ అండ్ బ్లడ్’ (Fire and Blood) నవలగా ఆధారంగా చేసుకుని ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను రూపొందించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు 200ఏళ్ల ముందు జరిగిన ఘటనలను ఈ ప్రీక్వెల్‌లో చూపించారు. ఈ సిరీస్‌లో ఎమ్మా డి ఆర్సీ యువరాణి రెనిరా టార్గారియన్‌ (Rhaenyra Targaryen) పాత్రను పోషించారు. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ లో పాడీ కన్సిడైన్, మాట్ స్మిత్, ఒలివియా కుక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ షోను మొదటి నుంచి అనుసరిస్తున్న ఫ్యాన్స్‌ను ప్రీక్వెల్ తిరిగి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా ఉన్నాయి. 


Updated Date - 2022-09-22T02:27:52+05:30 IST