
బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్ హనీమూన్ జరిగింది చెన్నైలోనే. తెలుగులో సూపర్‌డూపర్ హిట్టయిన ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నారు నిర్మాత నాగిరెడ్డి. నాడు బాలీవుడ్‌ను ఏలుతున్న దిలీప్‌కుమార్‌ను అందుకు ఒప్పించారు. ఆ చిత్రం పేరు ‘రామ్ ఔర్ శ్యామ్’. దిలీప్‌కుమార్‌కు అదే తొలి ద్విపాత్రాభినయం కూడా. అయితే అప్పుడే ఆయనకు నటి సైరాభానుతో పెళ్లయింది. పెళ్లి కాగానే హనీమూన్‌కు వెళ్లాలనుకున్నారు. కానీ ఈ సినిమా కోసం ఆయన హనీమూన్ మానుకుని వచ్చారు. అందుకు అనువుగా నాగిరెడ్డి కూడా హోటల్లో రూం బుక్ చేయకుండా ఆ దంపతులకు ఏకాంతం దొరికేలా స్థానిక వలసరవాక్కంలోని ‘కరీం బీడీ’ వారి గార్డెన్స్‌లో వున్న బంగాళాను తీసుకున్నారు. మేడమీద మరో గది కట్టించి, ఏసీ పెట్టించి వారికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఒకరకంగా అదే తొలిరాత్రి అన్నట్లుగా ప్రతిరోజూ ఏర్పాట్లు చేసేవాళ్లు. ఆ దంపతులకు అదే హనీమూన్ ప్రాంతమైంది. నాగిరెడ్డి పెద్దకుమారుడు ప్రసాద్ ఇంటి నుంచే ఫుడ్ వెళుతుండేది. వారికోసం రకరకాలైన వంటకాలు తయారు చేసి పంపిస్తుండేవారు. ప్రసాద్ స్వయంగా వారికి అన్ని ఏర్పాట్లు చూసేవారు. దిలీప్‌కుమార్ ప్రసాద్‌ను ‘నవాబ్ ఆఫ్ కోడంబాక్కం’ అని ప్రేమగా పిలిచేవారని నాగిరెడ్డి తనయుడు, ‘చంద్రమామ’ పత్రికకు మూడు దశాబ్దాలపాటు సంపాదకునికిగా వ్యవహరించిన విశ్వనాధ్రెడ్డి (విశ్వం) ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. చెన్నై, (ఆంధ్రజ్యోతి)
‘రామ్ ఔర్ శ్యాం’ చిత్ర షూటింగులో ఎన్టీఆర్, ఎంజీఆర్, నాగిరెడ్డి,
చక్రపాణి, విశ్వనాధరెడ్డి తదితరులతో దిలీప్‌కుమార్