కంటెంట్ లీకులు.. ఇంటి దొంగ‌ల ప‌నేనా?

ABN , First Publish Date - 2021-08-16T21:03:44+05:30 IST

కొన్ని వంద‌ల కుటుంబాల‌కు జీవ‌నోపాధిని క‌ల్పిస్తూ కోట్ల రూపాయ‌ల వ్యాపారాన్ని చేస్తున్న సినీ ప‌రిశ్ర‌మ‌కు రోజుకొక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. కోవిడ్ ప్ర‌భావంతో రెండేళ్లు సినిమాలు విడుద‌ల‌లు లేక థియేట‌ర్స్ బోసిపోయాయి.

కంటెంట్ లీకులు.. ఇంటి దొంగ‌ల ప‌నేనా?

కొన్ని వంద‌ల కుటుంబాల‌కు జీవ‌నోపాధిని క‌ల్పిస్తూ కోట్ల రూపాయ‌ల వ్యాపారాన్ని చేస్తున్న సినీ ప‌రిశ్ర‌మ‌కు రోజుకొక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. కోవిడ్ ప్ర‌భావంతో రెండేళ్లు సినిమాలు విడుద‌ల‌లు లేక థియేట‌ర్స్ బోసిపోయాయి. ఇప్పుడు అంతా స‌ర్ధుకుంటుంద‌నుకుంటున్నా త‌రుణంలో సినిమా కంటెంట్ లీకేజీ అనేది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇప్ప‌టికే పైర‌సీ భూతం నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలియ‌క మేకర్స్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఈ పైర‌సీ అనేది సినిమా విడుద‌లైన త‌ర్వాత ప్రొడ్యూస‌ర్స్‌ను ఇబ్బంది పెడుతుంటే.. సినిమా విడుద‌ల కాకుండానే కంటెంట్ ఎప్పుడు ఎవ‌డు లీక్ చేస్తాడోన‌నే కొత్త టెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. అత్తారింటికి దారేది విడుద‌ల‌కు ముందే స‌గం సినిమా ఇంట‌ర్నెట్‌లో లీక‌య్యింది. అలాగే బాహుబ‌లి చిత్రంలో పార్ట్ వ‌న్‌లో కీల‌క‌మైన ప‌దిహేను నిమిషాల యాక్ష‌న్ ఎపిసోడ్ కూడా లీక‌య్యింది. తాజాగా మ‌హేశ్ న‌టిస్తోన్న స‌ర్కారువారి పాట‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్, అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప సినిమాలోని సాంగ్ లీక‌య్యాయి. ఈ రెండు సినిమాల‌ను నిర్మిస్తున్న నిర్మాత‌లు ఒక‌రే కావ‌డంతో వారు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 


అయితే ఎంతో జాగ్ర‌త్త‌గా దాచుకున్న ఈ స్టార్ హీరో సినిమాల కంటెంట్ ఎందుకు, ఎలా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయని ప‌లు ప్ర‌శ్న‌లు మ‌దిలో మెదులుతాయి. అయితే స‌ర్కారువారిపాట‌, పుష్ప సినిమాల నుంచి లీకులు వ‌చ్చిన‌ప్పుడు సినిమా యూనిట్‌లోని కొంద‌రు సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి అలా చేశార‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే నిర్మాత‌లు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ వార్త‌ల‌కు చెక్ ప‌డ్డాయి. మ‌రి కంటెంట్‌ను ఎవ‌రూ లీక్ చేస్తున్నార‌ని ఆలోచిస్తే..ఇది ఇంటి దొంగ‌ల ప‌నేనా! అని అనిపించ‌క‌మాన‌దు. ఎందుకంటే పైర‌సీ బెడ‌ద నుంచి త‌ప్పించుకోవ‌డానికి వాట‌ర్ మార్క్‌ను ఉప‌యోగిస్తున్నారు. డైరెక్ట‌ర్ క‌ట్ అయితే దానికొక వాట‌ర్ మార్క్‌, హీరో క‌ట్ అయితే దానికొక వాట‌ర్ మార్క్‌.. ఇలా ప‌లు ర‌కాలైన వాట‌ర్ మార్క్స్‌తోనే కంటెంట్ స‌ద‌రు వ్య‌క్తుల‌కు వెళుతుంది. అయితే బ‌య‌ట‌కు లీకేజీలో వ‌స్తున్న కంటెంట్‌లో మాత్రం ఎలాంటి వాట‌ర్ మార్క్స్ క‌న‌ప‌డ‌టం లేదు. అంటే.. నిర్మాణ సంస్థ‌లోని వ్య‌క్తులో మ‌రేవ‌రో అయినా సినిమా కంటెంట్‌ల‌ను లీక్ చేసుండాలి. ఇంటిదొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేడంటారు. మ‌రి కంటెంట్ లీక్ చేస్తున్న ఇంటి దొంగ‌ల‌ను మేక‌ర్స్ ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి మ‌రి.

Updated Date - 2021-08-16T21:03:44+05:30 IST