ఆయన అక్షరాలు చైతన్య కిరణాలు

ABN , First Publish Date - 2022-05-24T06:10:18+05:30 IST

‘రుద్రవీణ’ చిత్రంలో ‘చుట్టుపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది...

ఆయన అక్షరాలు చైతన్య కిరణాలు

‘రుద్రవీణ’ చిత్రంలో ‘చుట్టుపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది, ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గేయ రచయిత సీతారామశాస్త్రి జయంతి సంద ర్భంగా తానా సంస్థ ప్రచురించిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి ఇటీవలె వెలువడింది. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేసుకున్నారు. ‘శాస్త్రిగారి రచనల్లోని గాఢతను చెబుతూ, కవిగా ఆయన్ను మరింత అర్థం చేసుకొనేలా త్రివిక్రమ్‌ చేశార’న్నారు. ‘రుద్రవీణ’ సహ నిర్మాతగా శాస్త్రిగారిని తొలిసారి కలసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే’ అనే పంక్తులు నా బాధ్యతను గుర్తు చేస్తుంటాయి’ అన్నారు. కవిగా ఆయన పాటల్లో సామాజిక బాధ్యత కనిపిస్తుందని ప్రశంసించారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు శాస్త్రిగారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. 


Updated Date - 2022-05-24T06:10:18+05:30 IST