Radhe shyam: ‘ఆషికి ఆ గయీ’ హిందీ వీడియో సాంగ్ విడుదల

ABN , First Publish Date - 2021-12-01T19:06:51+05:30 IST

'రాధే శ్యామ్' మూవీ నుంచి తాజాగా హిందీ వెర్షన్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీకి రాధాకృష్ణ దర్శకుడు.

Radhe shyam: ‘ఆషికి ఆ గయీ’ హిందీ వీడియో సాంగ్ విడుదల

'రాధే శ్యామ్' మూవీ నుంచి తాజాగా హిందీ వెర్షన్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీకి రాధాకృష్ణ దర్శకుడు. ఈ సినిమా 7 భాషలలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా ‘ఆషికి ఆ గయీ’ అంటూ సాగే ఫస్ట్ హిందీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మంచి విజువల్ ట్రీట్‌గా అనిపిస్తున్న ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల తెలుగు వెర్షన్ నుంచి వచ్చిన ‘ఈ రాతలే’ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ హిందీ వెర్షన్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, హిందీ భాషకు మనన్ భరద్వాజ్, సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 



Updated Date - 2021-12-01T19:06:51+05:30 IST