#Radheshyam : ఆకట్టుకుంటోన్న ‘సోచ్ లియా’ హిందీ సాంగ్

ABN , First Publish Date - 2021-12-08T21:56:23+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ప్రభాస్ విక్రమాదిత్య అనే ఆస్ట్రాలజర్ గా ఆసక్తికరమైన పాత్రలో నటిస్తుండగా.. ప్రేరణ అనే పాత్రలో పూజా అభినయించనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని జోరుగా చేస్తున్నారు మేకర్స్.

#Radheshyam : ఆకట్టుకుంటోన్న ‘సోచ్ లియా’ హిందీ సాంగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ప్రభాస్ విక్రమాదిత్య అనే ఆస్ట్రాలజర్ గా ఆసక్తికరమైన పాత్రలో నటిస్తుండగా.. ప్రేరణ అనే పాత్రలో పూజా అభినయించనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని జోరుగా చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఇప్పటి వరకూ విడుదలైన టీజర్స్, సింగిల్స్ సినిమా మీద భారీ అంచనాల్ని నెలకొల్పాయి. ఈ క్రమంలో తాజాగా ‘సోచ్ లియా’ అనే హిందీ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అరిజిత్ సింగ్ ఆలపించారు. ఈ వీడియో సాంగ్ లోని ప్రభాస్, పూజా విజువల్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ మేకోవర్ లో క్లాస్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మరింతగా ఆసక్తి నెలకొంది. ఇటలీలోనూ, ఇంకా పలు విదేశాల్లోనూ షూటింగ్ జరుపుకున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.  



Updated Date - 2021-12-08T21:56:23+05:30 IST