థియేటర్లలో హిందీ సినిమాల జాతరే...!

ABN , First Publish Date - 2021-09-27T05:21:00+05:30 IST

హిందీ చిత్ర పరిశ్రమ ఊపిరి తీసుకోవడానికి సిద్ధమైంది. థియేటర్లలో కొత్త చిత్రాలతో సందడి చేయడానికి సిద్ధమంటోంది. అక్టోబర్‌ 22 తర్వాత థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో....

థియేటర్లలో హిందీ సినిమాల జాతరే...!

హిందీ చిత్ర పరిశ్రమ ఊపిరి తీసుకోవడానికి సిద్ధమైంది. థియేటర్లలో కొత్త చిత్రాలతో సందడి చేయడానికి సిద్ధమంటోంది. అక్టోబర్‌ 22 తర్వాత థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో హిందీ చిత్రసీమలో హుషారు కనిపించింది. ఎందుకంటే... మహారాష్ట్రలో థియేట్రికల్‌ మార్కెట్‌ హిందీ సినిమా వసూళ్లకు కీలకం. అందుకని, ఇప్పటివరకూ వేచిచూశారు. ఇప్పుడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వరుసపెట్టి ప్రకటనలు చేశారు. 


మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం శనివారం వెలువడిన వెంటనే ‘సూర్యవంశీ’ని దీపావళికి విడుదల చేయనున్నట్టు అక్షయ్‌కుమార్‌ తెలిపారు. మరో మూడు చిత్రాల విడుదల తేదీలను ఆదివారం వెల్లడించారు. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళికి... మొత్తం ఐదు చిత్రాలతో ఆయన సందడి చేయనున్నారు. ‘సూర్యవంశీ’లో అతిథి పాత్రలో సందడి చేసిన రణ్‌వీర్‌ సింగ్‌... తాను నటించిన ‘83’ను క్రిస్మ్‌సకు, ‘జయే్‌షభాయ్‌ జోర్దార్‌’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. క్రిస్మ్‌సకు విడుదల చేయాలనుకున్న ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి వాయిదా పడింది. ‘జెర్సీ’తో డిసెంబర్‌ 31న 2021కు వీడ్కోలు పలకడానికి షాహిద్‌ కపూర్‌ సిద్ధమయ్యారు. కరోనా కారణంగా ఇన్నాళ్లూ విడుదలకు ఎదురుచూసిన పలు చిత్రాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాల విడుదలపై స్పష్టత రానుంది.



Updated Date - 2021-09-27T05:21:00+05:30 IST