Bigg Boss: రియాలిటీ షోలో పాల్గొని పాపులరైన తారలు

ABN , First Publish Date - 2022-09-30T23:14:01+05:30 IST

బాలీవుడ్‌లోని మెస్ట్ పాపులర్ రియాలిటీ షోస్‌ల్లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటి. ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ ఇప్పటికే 15సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది

Bigg Boss: రియాలిటీ షోలో పాల్గొని పాపులరైన తారలు

బాలీవుడ్‌లోని మెస్ట్ పాపులర్ రియాలిటీ షోస్‌ల్లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటి. ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ ఇప్పటికే 15సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బిగ్ బాస్-16’ ( Bigg Boss-16) కూడా తాజాగా ప్రసారం అవుతుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొంటే విపరీతమైన క్రేజ్, ఫేమ్ వస్తుంది. కంటెస్టెంట్స్ కెరీర్ కూడా మారిపోతుంటుంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత కెరీర్ మారిన కంటెస్టెంట్స్‌పై ఓ లుక్కేద్దామా..


షెహనాజ్ గిల్ (Shehnaaz Gill): 

బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. దిల్జీత్ దోసాంజే‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ లో కీలక పాత్ర పోషిస్తుంది.


హీనా ఖాన్ (Hina Khan): 

బిగ్‌బాస్ పులిగా ఆమెకు పేరుంది. ఈ రియాలిటీలో పాల్గొన్న తర్వాత ఆమెకు అవకాశాలు వెలువెత్తాయి. ‘నాగిన్-5’ లో కీలక పాత్ర పోషించింది. అనంతరం సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్‌సిరీస్‌లో కనిపించింది. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై  కూడా నడిచింది.  


రష్మి దేశాయ్ (Rashami Desai):

బిగ్‌బాస్‌లో పాల్గొనడంతోనే రష్మికి రెండు ప్రాజెక్టుల్లో అవకాశం వచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ లో అతిథి పాత్రను పోషించింది. అనంతరం ‘నాగిన్-4’ లో కీలక పాత్రను పోషించింది. ‘నాగిన్-6’ లోను అతిథి పాత్రను పోషించింది. 


ప్రతీక్ సెహజ్‌పాల్ (Pratik Sehajpal):

బిగ్‌బాస్ ఓటీటీ, బిగ్‌బాస్-15లో పాల్గొన్న తర్వాత ప్రతీక్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. అనంతరం అతడు మరో రియాలిటీషోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘ఖత్రొం‌కే ఖిలాడీ-12’ లో పాల్గొన్నాడు. ‘నాగిన్-6’ లోను కీలక పాత్ర పోషిస్తున్నాడు. 


తేజస్వీ ప్రకాష్ (Tejasswi Prakash):

‘బిగ్‌బాస్-15’ టైటిల్ విజేతగా తేజస్వీ నిలిచింది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్‌లోనే మోస్ట్ పాపులర్ సీరియల్ ‘నాగిన్-6’ లో నాగినీ పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు ఆమె పాపులారిటీ పెరిగిపోతూనే ఉంది. ఈ మధ్యనే గోవాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం కరణ్ కుంద్రాతో ప్రేమాయణాన్ని నడుపుతుంది. 


Updated Date - 2022-09-30T23:14:01+05:30 IST