ఫస్ట్‌ మొబైల్‌ థియేటర్‌.. అక్షయ్‌కు గౌరవం!

ABN , First Publish Date - 2021-08-30T20:59:16+05:30 IST

ప్రపంచంలోనే అతి ఎత్తైన మొబైల్‌ థియేటర్‌ను లద్దాఖ్‌లో ప్రారంభమైంది. సముద్ర మట్టానికి సుమారు 11,562 అడుగుల ఎత్తులో, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సౌకర్యాలతో ఈ మొబైల్‌ థియేటర్‌ను నెలకొల్పారు.

ఫస్ట్‌ మొబైల్‌ థియేటర్‌.. అక్షయ్‌కు గౌరవం!

ప్రపంచంలోనే అతి ఎత్తైన మొబైల్‌ థియేటర్‌ లద్దాఖ్‌లో ప్రారంభమైంది. సముద్ర మట్టానికి సుమారు 11,562 అడుగుల ఎత్తులో, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సౌకర్యాలతో ఈ మొబైల్‌ థియేటర్‌ను నెలకొల్పారు. మారుమూల గ్రామాల ప్రజల సైతం సినిమాకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పిక్చర్‌ టైమ్‌ ఫౌండర్‌, సీఈఓ సుశీల్‌ తెలిపారు. తాజాగా బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన మొబైల్‌ థియేటర్‌లో ‘బెల్‌బాటమ్‌’ చిత్రాన్ని ప్రదర్శించడం నాకు గక్కిన గౌరవంగా భావిస్తున్నా. దీనితో నా మనసు నిండిపోయింది’’ అని ట్వీట్‌ చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వం వహించారు. వాణీకపూర్‌, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు. పలు మార్లు వామిదా పడుతూ వచ్చిన ఈ చిత్రంపై అభిమానులు అంచనాలు పంచుకున్నారు. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకొంది. 





Updated Date - 2021-08-30T20:59:16+05:30 IST