అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో విశాల్ ‘లాఠీ’

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్.. తాజాగా ‘లాఠీ’ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదలకానుంది. ఇందులో విశాల్ మురళీ కృష్ణ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునైన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీలో 300 మంది ఫైటర్స్ తో భారీ ఎత్తున ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. 


ప్రస్తుతం ఈ సన్నివేశ చిత్రీకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న ఒక భారీ కట్టడంలోకి గూండాల గుంపు ఆయుధాలతో దూసుకుపోవడం సీన్. ఆసక్తిని రేపుతున్న ఈ సీన్ థియేటర్స్ లో ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీతో ఉన్నారు అభిమానులు. అయితే ఈ వీడియోలో విశాల్ కనిపించడం లేదు. గతంలో విశాల్ పోలీస్ గా నటించిన ‘సెల్యూట్, అయోగ్య’ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. మరి ‘లాఠీ’ సినిమా విశాల్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.  


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.