అప్పటి వరకు నో మ్యారేజ్‌: తమన్నా

ABN , First Publish Date - 2022-01-26T01:30:53+05:30 IST

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా లేటు వయస్సులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్‌గా, అలాగే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా తమన్నా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో

అప్పటి వరకు నో మ్యారేజ్‌: తమన్నా

ఇప్పుడు తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని.. మరో రెండేళ్ళ వరకు పెళ్ళి ప్రస్తావనే లేదని మిల్కీబ్యూటీ తమన్నా అంటోంది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా లేటు వయస్సులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్‌గా, అలాగే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా తమన్నా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా పెళ్ళి గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. మరో రెండేళ్ళ వరకు పెళ్ళి ఆలోచనకు తావే లేదు. ఇపుడు నా దృష్టాంతా కెరీర్‌పైనే ఉంది. రెండేళ్ళ తర్వాత ఖచ్చితంగా పెళ్ళి గురించిన ఆలోచన చేస్తాను.. అప్పటి వరకు నో మ్యారేజ్‌’’ అని తేల్చి చెప్పింది.

Updated Date - 2022-01-26T01:30:53+05:30 IST