మహేశ్ నా ఫేవరేట్ హీరో: సంజ‌నా చౌద‌రి

ABN , First Publish Date - 2020-12-29T01:45:15+05:30 IST

"బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది'' హీరోయిన్ సంజనా చౌదరి ఇంటర్వ్యూ

మహేశ్ నా ఫేవరేట్ హీరో:  సంజ‌నా చౌద‌రి

జబర్ధస్త్' కమెడియన్ షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది''. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధు లుకాలపు, సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్నారు.  ప్రియ,  అర్జున్ కళ్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక హీనా, రితిక చక్రవర్తి, సంజన చౌదరి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర వర్మ అల్లూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పిఆర్ సంగీతం సమకూరుస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో వ‌స్తోన్న 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది`  త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న సంద‌ర్భంగా హీరోయిన్ సంజనా చౌదరి చెప్పిన విశేషాలు..

*మా స్వ‌స్థ‌‌లం బీహార్‌, నేను హైద‌రాబాద్‌లోనే చ‌దువుకున్నాను. జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్స్ చేశాను. 

*కాలేజ్ రోజుల్లో మూవీస్ పై ఇంట్రెస్ట్‌తో బ్యూటీ కాంపిటేష‌న్స్ లో పాల్గొన్నాను, ఆ త‌ర్వాత‌ మోడ‌ల్, అలా యాక్ట‌ర్‌ని అయ్యాను.

* `న్యూలీ మ్యారీడ్` అనే వెబ్ ఫిలిం చేశాను, శ్రేయాస్ ఈటీలో విడుద‌లైంది. ‌ 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది` హీరోయిన్ గా నా రెండ‌వ చిత్రం. 

* ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్ట‌ర్‌. కొత్త‌గా పెళ్లి అయిన కొంత మంది స్నేహితులు క‌లిసి హాలీడే కోసం దూరంగా ఉన్న ఒక ఫాం హౌజ్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటారు. అక్క‌డికి వెళ్ల‌గానే స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధిస్తుంది. ఆ త‌ర్వాత ఆ ఇంట్లో వారికి కొన్ని అసాదార‌ణ సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వాటిని  అంద‌రూ క‌లిసి ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఇంట్లో నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనేది క‌థాశం. 

* ఇది హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడీతో పాటు మరికొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. 

*ఈ సినిమా ఒక ఇంట్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అంద‌రం అక్క‌డే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాం. అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి.  పూర్త‌య్యే స‌రికి అంద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది. 

* ప్ర‌స్తుతం `క‌థ మొద‌లైంది` అని ఒక స‌స్పెన్స్ కామెడీ మూవీ చేస్తున్నాను. న‌టిగా పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లిగే అన్నిరకాల క్యారెక్ట‌ర్స్  చేయాల‌నుకుంటున్నాను. 

* న‌టిగా ప్ర‌తిరోజు ఎంతోకొంత నేర్చుకుంటూ న‌న్నునేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. తెలుగులో మ‌హేశ్‌బాబు నా ఫేవ‌రేట్ హీరో.

Updated Date - 2020-12-29T01:45:15+05:30 IST