బేకరీ కుర్రాడితో హీరోయిన్‌ ప్రేమాయణం

ABN , First Publish Date - 2021-09-07T06:47:41+05:30 IST

మిడిల్‌ క్లాస్‌ బేకరీ కుర్రాడు విజయ్‌తో హీరోయిన్‌ ఐరా వాసిరెడ్డి ఎలా ప్రేమలో పడింది? వాళ్లిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? విజయ్‌ జీవితంలో మహి స్థానం ఏమిటి? చివరికి, ఏమైంది...

బేకరీ కుర్రాడితో హీరోయిన్‌ ప్రేమాయణం

మిడిల్‌ క్లాస్‌ బేకరీ కుర్రాడు విజయ్‌తో హీరోయిన్‌ ఐరా వాసిరెడ్డి ఎలా ప్రేమలో పడింది? వాళ్లిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? విజయ్‌ జీవితంలో మహి స్థానం ఏమిటి? చివరికి, ఏమైంది? అనే కథతో రూపొందిన ‘ఆహా’ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ’. విజయ్‌గా సంతోష్‌ శోభన్‌, ఐరా పాత్రలో టీనా శిల్పరాజ్‌, మహిగా విష్ణుప్రియ నటించారు. జొనాథన్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకత్వం వహించారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న ‘ఆహా’ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది. సోమవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘తెలుగు వీక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ‘ఆహా’ కృషి చేస్తోంది. ‘కుడి ఎడమైతే’, ‘తరగతి గది’ తర్వాత ‘ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ’ సైతం ప్రజల్ని ఆకట్టుకుంటుంది’’ అని ‘మై హోమ్‌’ గ్రూప్‌ డైరెక్టర్‌ మేఘన జూపల్లి అన్నారు. ‘‘సిరీస్‌లో రొమాన్స్‌ ఫిక్షనల్‌ కావొచ్చు. కానీ, పాత్రలు, సందర్భాలు కాదు. తరచూ సమాజంలో అటువంటి పాత్రలు మనకు కనిపిస్తాయి’’ అని సంతోష్‌ శోభన్‌ చెప్పారు. ఇంటర్నేషనల్‌ సిరీస్‌కు ఇది రీమేక్‌ అయినప్పటికీ... తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశామని యూనిట్‌ సభ్యులు తెలిపారు.


Updated Date - 2021-09-07T06:47:41+05:30 IST