కొత్తింట్లోకి ‘కె.జి.యఫ్‌’ హీరో

‘కె.జి.యఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ కథానాయకుడు యశ్‌. సతీమణి రాధికా పండిట్‌ సమేతంగా గురువారం ఆయన కొత్తింట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని ప్రెస్టీజ్‌ గోల్ఫ్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను ఆయన కొనుగోలు చేశారు. యశ్‌ తల్లితండ్రులు, కొంతమంది కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో గృహప్రవేశం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక, సినిమాలకు వస్తే... త్వరలో ‘కె.జి.య్‌ఫ-2’తో థియేటర్లలోకి యశ్‌ రానున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.