Beast సినిమాకు ముందు వరకు.. పదేళ్ల పాటు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని Vijay.. కారణమడిగితే ఏం చెప్పాడంటే..

Twitter IconWatsapp IconFacebook Icon
Beast సినిమాకు ముందు వరకు.. పదేళ్ల పాటు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని Vijay.. కారణమడిగితే ఏం చెప్పాడంటే..

విభిన్న పాత్రలను పోషిస్తూ కొత్త రకం కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు విజయ్ (Vijay). కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే హీరోల్లో ఆయన ఒకరు. విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం ‘బీస్ట్’ (Beast). ఏప్రిల్‌లో విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ‘బీస్ట్’ సినిమా కోసం ఆయన చివరగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ, అంతకు ముందు పదేళ్ల వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అందుకు కారణమేంటని అడగగా ఆయన స్పందించారు. 


విజయ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని గుర్తు చేసుకుని సమాధానం ఇచ్చారు. ‘‘నేను పదేళ్ల క్రితం ఓ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చాను. నా అభిప్రాయాలను వారు భిన్నంగా ప్రచురించారు. నేను మాట్లాడిన కొన్ని విషయాలు నాకే ఘోరంగా అనిపించాయి. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఎందుకు ఆ విధంగా మాట్లాడావని అడిగారు. నేను ఇంటర్వ్యూలో ఆ విధంగా మాట్లాడలేదని వారందరికి చెప్పాను. నేను చెప్పిన దానికి భిన్నంగా ప్రచురించారని తెలపడంతో వారందరు అర్థం చేసుకున్నారు. కానీ, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చెప్పలేను కదా. అందువల్ల అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాను. అందువల్ల పదేళ్ల పాటు మౌనంగా ఉన్నాను. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు’’ అని విజయ్ పేర్కొన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంకాంత్రి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, సంగీత, యోగిబాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనంతరం లోకేష్ కనకరాజ్‌తో కలసి విజయ్ పనిచేయనున్నారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.