ఇప్పటి వరకు ఇలాంటి ఓపెనప్ క్యారెక్టర్ చేయలేదు: హీరో సుశాంత్

ABN , First Publish Date - 2022-07-15T02:42:57+05:30 IST

ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించబడిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘మా నీళ్ల ట్యాంక్’. Zee5 ఓటీటీలో ఈ నెల 15 నుండి ప్రసారం కాబోతోంది. 8 ఎపిసోడ్‌ల సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌తో టాలీవుడ్ నటుడు సుశాంత్ ఓటీటీ అరంగేట్రం

ఇప్పటి వరకు ఇలాంటి ఓపెనప్ క్యారెక్టర్ చేయలేదు: హీరో సుశాంత్

ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించబడిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘మా నీళ్ల ట్యాంక్’. Zee5 ఓటీటీలో ఈ నెల 15 నుండి ప్రసారం కాబోతోంది. 8 ఎపిసోడ్‌ల సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌తో టాలీవుడ్ నటుడు సుశాంత్ ఓటీటీ అరంగేట్రం చేస్తున్నారు. అలాగే నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించబోతోంది.ఈ సిరీస్‌కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న సందర్బంగా ‘మా నీళ్ల ట్యాంక్’ ప్రీ రిలీజ్ వేడుకను గురువారం హైదరాబాద్‌లోని యఫ్. హౌస్‌లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి  ZEE5 టీం రాధా, అనురాధ, సుభాష్, తేజ్ రాజ్, లాయిడ్, శశాంక్, మ్యాత్యు వంటి వారందరూ పాల్గొన్నారు. 


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సిరీస్‌లో వంశీగా నటించిన సుశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా వెబ్ సిరీస్ కథలు విన్నాను కానీ అవేవి నచ్చక ఓకే చెయ్యలేదు. నాకు జీ 5 నుండి రాధా గారు, లక్ష్మి సౌజన్య గారు 8 ఎపిసోడ్స్‌ల స్క్రిప్ట్ చదవమని ఈ ‘మా నీళ్ల ట్యాంక్’ స్టోరీ ఇచ్చారు. నాకది కనెక్ట్ అవ్వడంతో ఆ స్క్రిప్ట్ ఓటీటీ కా, సినిమాకా, వెబ్ సిరీస్‌కా అని ఆలోచించకుండా.. స్క్రిప్ట్ నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఈ సిరీస్ షూట్‌లోకి వచ్చినప్పుడు సినిమా కంటే వెబ్ సిరీస్ లలో ఎక్కువ మంది నటిస్తున్నారు అనిపించింది. నిర్మాత ప్రవీణ్ కొల్లగారు చీరాల  దగ్గర నాగులపాలెంలో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. దర్శకురాలు లక్ష్మి సౌజన్య గారు ప్రతి క్యారెక్టర్‌ను చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించారు. జీ5‌లోని రాధాగారు, అనురాధగారు, సుహాస్‌గారు, సోషల్ మీడియా టీం లాయిడ్‌గారు, శశాంక్, శ్వేత ఇలా ప్రతి ఒక్కరూ మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన వారందరం.. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ నటించాము. ఈ వెబ్ సిరీస్ ను చూస్తుంటే ఇందులోని ప్రతి క్యారెక్టర్స్ మీకు గుర్తుండి పోతుంది. గోపాల్‌గా నటించిన సుదర్శన్ ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తాడు. ఈ సిరీస్ నాకు మోస్ట్ ఎంజాయ్ బుల్ ప్రాజెక్టు. ఎందుకంటే ఇందులో నేను చాలా ఓపెనప్ అవ్వాల్సి వచ్చింది. ఇందులో నేను చాలా వెటకారంగా, సరదాగా ఉండే వంశీ క్యారెక్టర్‌లో చాలాఎంజాయ్ చేస్తూ నటించాను. నేను మొదటిసారి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే పోలీస్ ఆఫీసర్  పాత్రలో నటించాను. ఇప్పటి వరకు ఇలాంటి ఓపెనప్ క్యారెక్టర్ చేయలేదు. నేను ప్రౌడ్‌గా చెప్పగలను.. ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమోగ్రఫీ లో ‘మా నీళ్ల ట్యాంక్’ ఉంటుందని. అందరూ హ్యాపీ‌గా ఇంట్లో కూర్చొని ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-07-15T02:42:57+05:30 IST