హీరో శ్రీ‌కాంత్ వదిలిన ‘క‌ళాకార్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

ABN , First Publish Date - 2021-07-18T01:04:10+05:30 IST

‘6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, శంక‌ర్‌దాదా ఎమ్‌.బి.బి.ఎస్‌, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రోహిత్.. ఇప్పుడు 'కళాకార్‌' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా

హీరో శ్రీ‌కాంత్ వదిలిన ‘క‌ళాకార్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

‘6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, శంక‌ర్‌దాదా ఎమ్‌.బి.బి.ఎస్‌, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రోహిత్.. ఇప్పుడు 'కళాకార్‌' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'కళాకార్‌'. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను హీరో శ్రీ‌కాంత్ విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ విడుదల అనంతరం హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. క‌ళాకార్ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫ‌స్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వెంక‌ట‌రెడ్డిగారు నిర్మాత‌గా శ్రీ‌ను బందెల డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. రోహిత్ నేను క‌లిసి ఎప్ప‌టినుండో ఇండ‌స్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆయ‌న మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్‌.. అని అన్నారు.


హీరో రోహిత్ మాట్లాడుతూ.. మా క‌ళాకార్ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను హీరో శ్రీ‌కాంత్‌గారు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎప్ప‌టినుంచో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ఫస్ట్‌ టైమ్‌ యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ స‌బ్జెక్ట్‌లో చేస్తోన్న చిత్ర‌మిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి న‌చ్చుతుంది.. అని తెలుపగా ''ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్‌ ముగింపు ద‌శ‌లో ఉందని, త్వ‌ర‌లోనే విడుద‌ల‌ తేదీని ప్ర‌క‌టిస్తామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.

Updated Date - 2021-07-18T01:04:10+05:30 IST