నాన్న‌ న‌న్ను డామినేట్ చేశార‌నే ఫీలింగ్ ఓసారి క‌లిగింది: చైతూ

ABN , First Publish Date - 2022-01-16T02:51:27+05:30 IST

‘బంగార్రాజు’ షూటింగ్‌లో నాన్న‌ న‌న్ను డామినేట్ చేశార‌నే ఫీలింగ్ ఓసారి క‌లిగింది అన్నారు యువసామ్రాట్ నాగచైతన్య. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన

నాన్న‌ న‌న్ను డామినేట్ చేశార‌నే ఫీలింగ్ ఓసారి క‌లిగింది: చైతూ

‘బంగార్రాజు’ షూటింగ్‌లో నాన్న‌ న‌న్ను డామినేట్ చేశార‌నే ఫీలింగ్ ఓసారి క‌లిగింది అన్నారు యువసామ్రాట్ నాగచైతన్య. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘బంగార్రాజు’ చిత్రం ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్ టాక్‌‌ని సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ..


‘‘సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రం విడుదలై.. ‘బంగార్రాజు’ ప్రకటించినప్పుడే సినిమాపై భారీగా అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమాలో చేయ‌డం నాకు స‌వాల్‌గా అనిపించింది. గ్రామీణ నేప‌థ్యం, ఎనర్జిటిక్ పాత్ర ఇంత‌వ‌ర‌కు చేయ‌లేదు. ఈ పాత్ర చేయ‌డానికి ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ చాలా స‌పోర్ట్ చేశాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఆయ‌న న‌న్ను ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేశాడు. బంగార్రాజుతో మ‌రింత ద‌గ్గ‌ర‌కు వెళ్ళేలా చేశాడు. క‌థ విన్నాక ఆయ‌న చెప్పిన‌ట్లు చేయ‌డ‌మే. ఆయ‌నకు అంద‌రి ప‌ల్స్ బాగా తెలుసు. ఇక షూటింగ్‌లో నాన్న‌గారు న‌న్ను డామినేట్ చేశార‌నే ఫీలింగ్ ఓసారి క‌లిగింది. అది ప్రేర‌ణ‌గా తీసుకుని ముందుకు సాగాను. కాస్త జ‌ల‌సీ అనిపించినా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో న‌న్న నడిపించింది’’ అని అన్నారు.



Updated Date - 2022-01-16T02:51:27+05:30 IST