ఆ స్పందన చూసి.. తెలియని ఎన‌ర్జీ వ‌చ్చింది: అశోక్ గల్లా

అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘హీరో’. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో.. ‘‘చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ఎన‌ర్జీని చూశాను. అది మాకు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని ఏరియాల్లో సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. హీరో అశోక్‌ను చూసిన వారంతా మాస్ హీరో అంటూ సంబోధిస్తూ, అశోక్‌కు ఇది మొద‌టి సినిమాలా లేద‌ని అంటున్నారు. మాకు సంక్రాంతి విజ‌యం ద‌క్కింది. మీకూ సంక్రాంతి ఇవ్వ‌డానికి థియేట‌ర్ల‌లోనే ఉన్నాం. ఇంకా చూడ‌నివారు చూసి ఆనందించండి అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పేర్కొనగా.. హీరో అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ.. ‘‘తొలి సినిమాకే నాకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు క‌లగ‌డం ఆనందంగా వుంది. ఈరోజు థియేట‌ర్‌కు టీమ్‌తో క‌లిసి వెళ్ళాను. ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ చూస్తుంటే నాలో తెలీని ఎన‌ర్జీ వ‌చ్చింది. తొలి సినిమా అనుభూతి ఎంక‌రేజింగా ఉండ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ టీమ్ అంతా ఈ సినిమాకు చ‌క్క‌గా పనిచేశారు. చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు..’’ అని తెలిపారు.


ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్‌స్టార్ అభిమానుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.. చిత్ర విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలపగా.. చిత్ర నిర్మాత శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు దేవీ థియేట‌ర్‌లో సినిమా చూశాం. ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా తొలి సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డం ప్రోత్సాహంగా ఉంది. అందుకే ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల‌నుకున్నాం. అంద‌రికీ కామెడీ బాగా న‌చ్చింది. హిలేరియ‌స్ కామెడీ, థ్రిల్లింగ్ మూవీ ఇది. ఈ కష్టకాలంలో కాస్త రిలీఫ్‌‌ని ఇచ్చే సినిమానే ‘హీరో’ చిత్రం. సంక్రాంతికి పండుగ చేసుకుంటూ మా హీరో సినిమాను చూసి మ‌రింత ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.