ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హీరో’?

ABN , First Publish Date - 2022-01-21T15:48:55+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయ చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఈ సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. పొంగల్ సీజన్ లో ‘బంగార్రాజు’ మినహా పెద్ద సినిమాలేమీ లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలసివచ్చిందని చెప్పాలి. తొలి చిత్రమైనప్పటికీ ఎక్కడా తబడకుండా అశోక్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని పద్మావతి గల్లా నిర్మించారు. సినిమా విడుదలై నేటికి (శుక్రవారానికి) ఆరురోజులు అవుతుంది. సినిమా నాలుగు వారాల పాటు థియేటర్స్ లో రన్ అయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్టు సమాచారం. ఆమేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం హీరో చిత్రం ఫిబ్రవరి 13న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోందట. త్వరలోనే నిర్మాతలు ప్రకటించబోతున్నారు.  మరి ఓటీటీలో ఈ సినిమాకి ఇంకెంతటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Updated Date - 2022-01-21T15:48:55+05:30 IST