యువరాణి త్రిషా..మీ ఆజ్ఞను పాటించాను: హీరో కార్తీ ట్వీట్
ABN , First Publish Date - 2021-09-19T03:46:09+05:30 IST
సినీ నటి త్రిష, హీరో జయం రవిలను యువరాణి, యువరాజులుగా పోల్చుతూ హీరో కార్తీ ఓ ట్వీట్ చేశారు. ‘యువరాణి త్రిష... మీ ఆజ్ఞను పాటించాను. యువ రాజా జయం రవి... నా పని పూర్తిచేశాను’ అంటూ కార్తీ తన ట్విటర్ ఖాతాలో

సినీ నటి త్రిష, హీరో జయం రవిలను యువరాణి, యువరాజులుగా పోల్చుతూ హీరో కార్తీ ఓ ట్వీట్ చేశారు. ‘యువరాణి త్రిష... మీ ఆజ్ఞను పాటించాను. యువ రాజా జయం రవి... నా పని పూర్తిచేశాను’ అంటూ కార్తీ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ త్రిష, జయం రవిలకు ట్యాగ్ చేశారు. ఇలా వీరిద్దరినీ ట్యాగ్ చేయడానికి కారణం ఏమిటంటే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం స్వీయదర్శక నిర్మాణ సారథ్యంలో భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ‘పొన్నియిన్ సెల్వన్’ నిర్మితమవుతుంది. ఇందులో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే కొందరు తమతమ పాత్రలకు సంబంధించి షూటింగును పూర్తి చేశారు. ఇపుడు హీరో కార్తీ కూడా తన భాగం షూటింగ్ పూర్తి చేసి... ఇందులో యువరాణి, యువరాజుగా నటిస్తున్న త్రిష, జయం రవిలను ట్యాగ్ చేస్తూ ఆ విధంగా ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టరును రిలీజ్ చేయనున్నారు.