Hero Karthi: ఇండియన్‌ స్పై థ్రిల్లర్‌‌గా ‘సర్దార్‌’.. అలాంటివేం ఉండవంటూ..

ABN , First Publish Date - 2022-10-16T15:21:55+05:30 IST

ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానరుపై హీరో కార్తీ (Karthi) ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సర్దార్‌’ (Sardar). నిర్మాత ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన..

Hero Karthi: ఇండియన్‌ స్పై థ్రిల్లర్‌‌గా ‘సర్దార్‌’.. అలాంటివేం ఉండవంటూ..

ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానరుపై హీరో కార్తీ (Karthi) ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సర్దార్‌’ (Sardar). నిర్మాత ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకి మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ  ఈ నెల 21వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా.. చిత్రం బృందం తాజాగా నగరంలో విలేకరులతో ముచ్చటించింది. సినిమా గురించి హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘ఇండియన్‌ మిలిటరీలో 1980లో గూఢచారుల బృందం ఏర్పాటైంది. దీన్ని ఇతివృత్తంగా చేసుకుని, ఈ మూవీని స్పై థ్రిల్లర్‌గా రూపొందించాం. మిలిటరీ గూఢచారుల హావభావాలను తెలుసుకునేందుకు ఒక వర్క్‌షాపును కూడా నిర్వహించాం. ఆ తర్వాత షూటింగ్‌ చేశాం. ఈ మూవీలో ఓ సందేశం కూడా ఇచ్చాం. దాన్ని దర్శకుడు మిత్రన్‌ అద్భుతంగా చూపించగలిగారు.


అదే సమయంలో స్పై థ్రిల్లర్ (Spy Thriller) మూవీ అనగానే హాలీవుడ్ మూవీ జేమ్స్‌ బాండ్ తరహాలోనే బికినీ, సిక్స్‌ప్యాక్‌ ఉంటుందా పలువురు ప్రశ్నించారు. కానీ, ఇది ఒక ఇండియన్‌ స్పై థ్రిల్లర్‌ మూవీ. కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేలా ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం హైలెట్‌. దాన్ని జీవీ ప్రకాష్‌ కుమార్‌ అద్భుతంగా సమకూర్చారు. ఈ సినిమాలో యువకుడిగా కంటే వృద్ధుడి పాత్రలో నటించడమే చాలా కష్టమనిపించింది. వయస్సు తగినట్టుగా హామభావాలు పలికించడం కోసం ఎంతో శ్రమించా’ అని వివరించారు. ఈ చిత్రంలో హీరోయిన్లు రాశీఖన్నా, రజీషా విజయన్‌, లైలా, దర్శకుడు మిత్రన్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.



Updated Date - 2022-10-16T15:21:55+05:30 IST