ధనుష్ ‘సార్‌’ కు పాజిటివ్... షూటింగ్‌కు బ్రేక్

ABN , First Publish Date - 2022-01-25T15:50:52+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మాణం జరుపుకుంటోంది. తమిళంలో ‘వాత్తి’ పేరుతో విడుదలవుతుంది. రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కొద్ది రోజులు చిత్రీకరణ జరుపుకున్న తర్వాత .. హీరో ధనుష్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో షూటింగ్‌కు సడెన్ బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ధనుష్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉన్నారు. వారం, పదిరోజుల వరకూ ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్సే లేదు.

హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలు పెట్టిన చిత్ర బృందం.. ఈ షెడ్యూల్ ను భారీగా ప్లాన్ చేశారట. ఎక్కువ సీన్స్ ధనుష్ మీదే ఉండడంతో ఆయన పూర్తిగా కోలుకొనే వరకూ ‘సార్’ చిత్రీకరణ ముందుకు సాగదు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ధనుష్ ఎప్పటికి కోలుకుంటాడో..  షూటింగ్ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-25T15:50:52+05:30 IST