వెండితెర మీద ముద్దు సీన్లు ఎందుకు చేయబోరని అడగగా.. Salman Khan ఇచ్చిన సమాధానమిది..

ABN , First Publish Date - 2021-12-02T02:40:51+05:30 IST

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తాజాగా అతడు ‘ అంతిమ్ ’ సినిమాలో నటించాడు. సల్మాన్ బామ్మర్ది

వెండితెర మీద ముద్దు సీన్లు ఎందుకు చేయబోరని అడగగా..  Salman Khan ఇచ్చిన సమాధానమిది..

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్.  తాజాగా అతడు ‘ అంతిమ్ ’ సినిమాలో నటించాడు. సల్మాన్ బామ్మర్ది ఆయుష్ శర్మ హీరోగా నటించాడు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు భాయిజాన్ సమాధానమిచ్చాడు. వెండితెర మీద ముద్దు సీన్లను ఎందుకు చేయరని అడగగా జవాబు ఇచ్చాడు.


‘‘కుటుంబ ప్రేక్షకుల కోసం మాత్రమే సినిమాలో నేను నటిస్తాను. అందువల్ల ఎటువంటి అసభ్యతకు తావులేని చిత్రాల్లో నటించాలని కోరుకుంటాను. ఈ కారణం వల్లనే వెండితెర మీద ముద్దు సీన్లను చేయను. నేను నటించిన సినిమాల్లోని పాత్రలు కూడా చెడు పదజాలాన్ని ఉపయోగించవు. న్యూడ్, లవ్ మేకింగ్, కిస్సింగ్ సీన్లను చేయను. ఆ విధంగానే సినిమా ఉండాలని కోరుకుంటాను. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రావడంతో సినిమా అనేది పూర్తిగా మారిపోయింది. ఆ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే మూవీస్ కూడా చూడను. ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేకర్స్ అటువంటి సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారని నేను అటువంటి సీన్లను చేయను. నా తల్లిదండ్రులు, అభిమానులు, పిల్లలు అందరు నా సినిమాల్ని చూస్తారు. అందువల్ల అసభ్యతకు తావులేని చిత్రాల్లో మాత్రమే నటిస్తాను ’’ అని సల్మాన్ ఖాన్ చెప్పాడు 


‘‘ అంతిమ్ ఫైనల్ కట్ చూసిన అనంతరం మా నాన్న కొన్ని లవ్ మేకింగ్ సీన్లను తొలగించమని చెప్పారు. అటువంటి సీన్స్ ఏమి లేవు కదా అని నేను సమాధానమిచ్చాను. ఎప్పుడైనా మీరు ఓటీటీలో వచ్చే సినిమాలను చూశారా అని నేను నవ్వాను. కుటుంబ సమేతంగా నా సినిమాలను అందరు చూడాలనేదే నా కోరిక. అందువల్లే వెండి తెర మీద ముద్దు సీన్లు చేయాలంటే కొన్ని పరిమితులు విధించుకున్నాను ’’ అని అతడు వెల్లడించాడు.

Updated Date - 2021-12-02T02:40:51+05:30 IST