Hema Malini: కంగనా రనౌత్‌పై నటి పరోక్ష విమర్శలు .. అలాగైతే రాఖీ సావంత్ కూడా వస్తుందంటూ..

ABN , First Publish Date - 2022-09-25T18:30:31+05:30 IST

బాలీవుడ్‌(Bollywood)లో వివాదం అంటే మొదట గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్(Kangana Ranaut). ఏ విషయం మీదైనా ఎటువంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టిన్నట్లు మాట్లాడుతుంటుంది...

Hema Malini: కంగనా రనౌత్‌పై నటి పరోక్ష విమర్శలు .. అలాగైతే రాఖీ సావంత్ కూడా వస్తుందంటూ..

బాలీవుడ్‌(Bollywood)లో వివాదం అంటే మొదట గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్(Kangana Ranaut). ఏ విషయం మీదైనా ఎటువంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టిన్నట్లు మాట్లాడుతుంటుంది. దాంతో ఈ బ్యూటీ సినిమాతో కంటే వివాదాలతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె ఎక్కువగా బాలీవుడ్‌లో రాజకీయాలు లేదా బంధుప్రీతి మీద, అలాగే దేశంలోని ఇతర అంశాల మీద ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. కాగా.. ఇటీవలే ఈ బ్యూటీ తమిళనాడులోని మధురైలోని బాంకే బిహారీ ఆలయాన్ని కుటుంబంతో కలిసి సందర్శించింది. ఆ సందర్భంలో మీడియాతో భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, అది కూడా మధురై నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది. రాజకీయాల గురించి కంగన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.


తాజాగా మధులోని అదే ఆలయాన్ని తాజాగా బాలీవుడ్ నటి హేమమాలిని (Hema Malini) సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ రాజకీయ ఎంట్రీ వ్యాఖ్యలపై స్పందించింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో హేమా మాలిని మాట్లాడుతూ.. ‘ఆ వ్యాఖ్యలపై నేనేం మాట్లాడలేను. కానీ శ్రీకృష్ణుడు అన్ని చూసుకుంటాడు. ప్రజలకు ఇక్కడి వ్యక్తిని ఎన్నుకోవడం ఇష్టం లేదోమో. సినీ నటి కావాలి. తర్వాత రాఖీ సావంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశ్చర్యం లేదు’ అని వెటకారంగా చెప్పుకొచ్చింది.


కాగా.. కంగనా రనౌత్ ప్రస్తుతం ‘టికు వెడ్స్ షేరు’తో బిజీగా ఉంది. ఈ మూవీ నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ మూవీని కంగననే నిర్మిస్తోంది. అంతేకాకుండా.. ఈ బ్యూటీ ‘ఎమర్జెన్సీ’ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. ఇటీవలు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి.



Updated Date - 2022-09-25T18:30:31+05:30 IST