ఆయన చాలా కసిగా నటించారు
ABN , First Publish Date - 2022-11-30T04:52:22+05:30 IST
‘‘హిట్ 2’కు కథ చెప్పి నానీని సులువుగానే ఒప్పించాను. మా ఇద్దరి ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది. కానీ...

‘‘హిట్ 2’కు కథ చెప్పి నానీని సులువుగానే ఒప్పించాను. మా ఇద్దరి ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది. కానీ అడివిశే్‌షను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కథ చెప్పినప్పుడు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐదారు సిట్టింగ్స్ అయ్యాకే శేష్ ఓకే చెప్పారు’’ అని శైలేష్ కొలను అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మించిన చిత్రం ఇది. డిసెంబరు 2న విడుదలవుతోన్న సందర్భంగా శైలేష్ మీడియాతో ముచ్చటించారు.
‘హిట్’ ఫస్ట్‌పార్ట్‌లోని విష్వక్‌సేన్ రుద్రరాజు కథనే కొనసాగించవచ్చు కానీ కొత్తదనం ఉండాలనే ఆలోచనతోనే ఫ్రాంచైజీ ప్లాన్ చేశాం. అడివి శేష్ ఆఫీసర్ పాత్రకు చక్కగా సరిపోతారు. క్లైమాక్స్‌లో కొత్తశే్‌షను చూస్తారు. ఎంతో కసిగా చేశారు.
‘హిట్’ ఫ్రాంచైజీ ఒక్కో భాగంలో ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చే సి వారు సాల్వ్ చేసిన కేసుల గురించి చెప్పాలనుకుంటున్నాం. మాత్రం ఈ ఆఫీసర్లను అందరినీ కలిపి ‘హిట్’ చివరి భాగం చేయాలని ప్లాన్ చేశాం. ‘అవెంజర్స్’ తరహాలో అనుకోవచ్చు. రాబోయే చిత్రాల్లో విష్వక్ కూడా కనిపిస్తారు.
ఫ ‘హిట్’ సీజన్ క్రియేట్ చేయమని రాజమౌళి ఇచ్చిన సలహా మాకూ నచ్చింది. కానీ నేను ఇక ఏటా ‘హిట్’ సినిమాను మాత్రమే చేయాల్సి వస్తుంది. ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు. కొన్ని కథలు సిద్ధం చేసుకున్నాను. త్వరలోనే నా తదుపరి చిత్రం గురించి తెలియజేస్తాను.