వెంటాడే ప్రేమ కథ

ABN , First Publish Date - 2021-07-23T10:34:16+05:30 IST

అరుణ్‌ ఆదిత్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు...

వెంటాడే ప్రేమ కథ

అరుణ్‌ ఆదిత్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కథానాయిక వాయి్‌సతో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరు ప్రేమికుల మధ్యన సాగే సన్నివేశాల్లో హీరో, హీరోయిన్ల నటన,  సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ ‘‘కథను దర్శకుడు తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలో తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కథ తాలుకు భావోద్వేగాలు కొన్నాళ్లపాటు ప్రేక్షకులను వెంటాడతాయి. కథపైన ఉన్న నమ్మకంతో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని చిత్ర దర్శకుడు సుశాంత్‌రెడ్డి అన్నారు. అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి గౌరి హరి సంగీతం అందించారు. 


Updated Date - 2021-07-23T10:34:16+05:30 IST