చిరుతో హరీష్ శంకర్?
ABN , First Publish Date - 2022-03-23T06:44:08+05:30 IST
అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలు మూడు ఇప్పుడు ఒకేసారి షూటింగ్...

అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలు మూడు ఇప్పుడు ఒకేసారి షూటింగ్ జరుపుకొంటున్నాయి. ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు కొత్త కథలకు పచ్చజెండా ఊపుతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించడానికి చిరు ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మలయాళంలో విజయవంతమైన ‘బ్రో డాడీ’ చిత్రాన్ని రీమేక్ చేయాలన్నది చిరు ఆలోచన. అందుకోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం ‘బ్రో డాడీ’. పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. చిరు ‘గాడ్ ఫాదర్’ మలయాళ ‘లూసీఫర్’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. దానికీ పృథీరాజ్‌నే దర్శకుడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు హరీష్. ఆయనకు రీమేకులు కొట్టిన పిండే. హరీష్ దర్శకత్వంలో సూపర్ హిట్లయిన ‘గబ్బర్ సింగ్’, ‘గద్దలకొండ గణేష్’ రెండూ రీమేకు కథలే. అందుకే చిరు ఈ బాధ్యతని హరీష్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది.