హరీశ్‌ శంకర్‌ చేతులమీదుగా...

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. జి రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మాతలు. ‘కల్యాణ్‌రామ్‌ కత్తి’  దర్శకుడు మల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్‌ చూస్తుంటే మిస్టరీ జానర్‌ సినిమాలాగా ఆసక్తి కలిగిస్తోంది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.