'హరిహర వీరమల్లు': లొకేషన్స్ వేటలో క్రిష్ బృందం..

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాకు కొత్త లొకేషన్స్ వెతికేపనిలో బిజీగా ఉన్నారు క్రిష్ బృందం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం పాన్ ఇండియన్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్ వండర్‌గా క్రిష్ తెరకెక్కిస్తున్న ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాం పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాటికే చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా.. కొవిడ్ వేవ్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్ళి ఇప్పుడు వీరమల్లు చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు కొత్త లొకేషన్స్‌ను చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పిక్స్ నెట్టిన దర్శనమిచ్చి వైరల్ అవుతున్నాయి.   

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.