HariHara veeramallu: ఆ రోజు.. పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే!

ABN , First Publish Date - 2022-08-29T22:21:42+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ పనులతో బిజీగా ఉన్నారు. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన జనాల్లోకి వెళ్తే ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటా? అనే అనుమానం లేకపోలేదు. అయితే దానికి తగ్గట్టే పవన్‌కల్యాణ్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, సినిమాల సమయం సినిమాలకే ఉంటుందని తెలిసింది.

HariHara veeramallu: ఆ రోజు.. పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Power star Pawankalyan) జనసేన పార్టీ పనులతో బిజీగా ఉన్నారు. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన జనాల్లోకి వెళ్తే ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటా? అనే అనుమానం లేకపోలేదు. అయితే దానికి తగ్గట్టే పవన్‌కల్యాణ్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, సినిమాల సమయం సినిమాలకే ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ఆయన చేతిలో క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Harihara veeramallu), సురేందర్‌రెడ్డితో ‘పీఎస్‌పికే29’. హరీష్‌ శంకర్‌తో భవదీయుడు ‘భగత్‌సింగ్‌’ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగత షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని పవన్‌ సన్నిహితుల నుంచి సమాచారం. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నారట ‘హరిహర వీరమల్లు’ చిత్ర బృందం. ఆ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు, టీజర్‌ పీకే పుట్టినరోజున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు క్రిష్‌ టీమ్‌. ఈ చిత్రం పవన్‌కల్యాణ్‌లో పవన్‌ పోషించే పాత్ర గతంలో ఎప్పుడూ ఆయన చేయలేదనీ, పవన్‌ కెరీర్‌కు మైల్‌స్టోన్‌లా ఉంటుందని నిర్మాత ఎ.ఎం.రత్నం ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. (harihara veeramallu teaser on September 2)


పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న విడుదల చేసే టీజర్‌, గ్లింప్స్‌ ఫ్యాన్‌కు పండగ వాతావరణాన్ని తలపించేలా ఉంటుందని చిత్రవర్గాల నుంచి సమాచారం. నిధీ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, నర్గీస్‌ ఫక్రీ, ఆదిత్యామీనన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకరరావు, ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరకర్త. 




Updated Date - 2022-08-29T22:21:42+05:30 IST